

సీఎం ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు పటేల్,కుమ్రంభీం మనువడు సోనేరావ
జనం న్యూస్ 10.ఫిబ్రవరి. కొమురం భీమ్ జిల్లా (ఆసిఫాబాద్ )డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె.ఏలీయా. గోండు వీరుడు కుమ్రం భీం వర్ధంతిని రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారిచేయడాన్ని హర్షిస్తూ శుక్రవారం హైదరాబాద్ లో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, కుమ్రం భీం మనువడు కుమ్రం సోనేరావుతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కృతఙ్ఞతలు తెలిపి శాలువాతో సన్మానించారు.కుమ్రం భీం పోరాటానికి అండగా నిలబడి పోరు సల్పిన జోడేఘాట్ పరిధిలోని 12 గ్రామాల ప్రజల సమస్యలు, పరిష్కరించాలని , రోడ్లు, ఇండ్లు మంజూరు చేయాలనీ ముఖ్యమంత్రి ని కోరారు.తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీని మొట్టమొదటి సారి సందర్శించిన కుమ్రం భీం మనుమడు సోనేరావును శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సన్మానించారు.