జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 13 సెల్ 9550978955
కె.వై.సి మరియు సురక్షితమైన బ్యాంకింగ్ వైపు మొదటి అడుగు అనే నినాదం తో వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక అక్షరాస్యత కాన్సిలర్ పృథ్వీరాజ్ మరియు కమలాదేవి గణపవరం గ్రామ పంచాయతీ పరిధిలోనీ సి.ఆర్ డిగ్రీ కళాశాలలో విద్యార్ధిని విద్యార్థులకు కె.వై.సి మరియు సి. కె. వై.సి సురక్షితమైన బ్యాంకింగ్ విధానాలపై అవగాహన కల్పించారు ప్రతి ఒక్కరూ కె. వై. సి పై అవగాహన కలిగి ఉండాలని, ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతుండటంతో వాటిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ మనోహర్ మరియు అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.


