జనం న్యూస్ 14 ఫిబ్రవరి వికారాబాద్ జిల్లా
ప్రేమ… అది ఎప్పుడు ఎక్కడ ఎలా ఉద్భవిస్తుందో తెలియదు. ప్రేమ….కు కులం మతం ఆస్తి అంతస్తులు హోదాలతోటి అవసరం లేదు. ప్రేమ…. గుడ్డిది మూగది అని ప్రేమకు వైకల్యాన్ని కూడా అంటగట్టారు.
ప్రేమ…. కోసం ప్రేమ పేరుతో జరిగే రాక్షసత్వాన్ని హింసను ఎందుకు వర్ణించ లేకపోయారు.
నేటి సమాజంలో విరివిగా విహరిస్తున్న… నూతన ప్రేమికులల్లో ఆకర్షణ ఎంత…? నిజమైన ప్రేమ ఎంత…?
ప్రేమించిన వాడి కోసం కన్న తల్లిదండ్రులను వదులుకొని సర్వస్వం ప్రేమించిన వాడే అనుకోని వస్తే… వాడు ప్రేమ పెళ్లి చేసుకొని ఆ తర్వాత నువ్వు తక్కువ కులం నా స్టేటస్ కు సరిపోవు అని అమ్మాయిని కాలు చేతులు నరికేసి మొండెం వేరు చేసి కడుపులో బిడ్డ తొ సహా ఒక ప్రేమికురాలిని కడతేర్చిన ప్రేమికుడు ఒకడైతే ప్రేమించి పెళ్లి చేసుకుందామని మాటిచ్చి కలిసి చదువుకొని ఉద్యోగం వచ్చినాక నా స్టేటస్ మారింది నాకు నువ్వు సరిపోవని మాట మార్చిన ప్రేమికుడి నుండి మోసపోయానని ఆ బాధను తట్టుకోలేక పట్టాలపై పరిగెత్తుకొచ్చే ట్రైన్ కు ఎదురెళ్లిన హృదయం మరొకటి అయితే.ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకొని కన్నవారికి దూరమై వాడే సర్వస్వంగా బ్రతుకుతున్న ఆమెకు తన ఇద్దరు పిల్లలకు తాగుడుకు బానిసై తమను నిర్లక్ష్యం చేసి మోసం చేస్తున్న భర్తతో బతకడం భారం కావడంతో కష్టాల్లో ఉన్నానని చెప్తే అక్కున చేర్చుకునే అన్న ఆదరించే కుటుంబం ఉన్న కానీ పిల్లలతో కన్నవారి ఇంటికి పోవడానికి మనసు ఒప్పుకోలేక ప్రేమించిన వాడిపై విరక్తి చెంది పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్న ప్రియురాలు ఇంకొకరు అయితే.
ప్రేమించిన వాడి కోసం కన్న తల్లిదండ్రులు పెళ్లి కి నిరాకరిస్తారని తనకు జీవితాన్ని ఇచ్చి పెంచి వాళ్ళ జీవితాన్ని అంత నిస్వార్ధంగా పిల్లల కోసమే ధారబోసిన తల్లి తండ్రులను కొత్త కొత్త పద్ధతులు ఎంచుకొని చావులోనూ నూతన ట్రెండ్ ను క్రియేట్ చేసిన కూతురు మరొకరు.సంఘటన ఏదైనా కావచ్చు కారణం మాత్రం ప్రేమే అవుతుంది. రోజులు మారుతున్నాయి పరిస్థితులు మారుతున్నాయి అవధులు లేకుండా ప్రేమ కూడా విహరిస్తుంది. కాని దాని ముగింపు మాత్రమే విషాదకరంగా నిలుస్తుంది. అసలు ప్రేమ ఎందుకు హింసను కోరుకుంటుంది. హింసించే పద్ధతుల్లో ప్రేమికుల యొక్క మనసు ఎందుకు బలపడుతుంది. నిత్యం వారి చుట్టూ ఉండే సాహిత్యం పరిస్థితులు సినిమాలు సోషల్ మీడియ వేదికలు టీవీ సీరియల్స్ వాళ్ల మెదడులో హింసను మాత్రమే ఎందుకు ప్రేరేపిస్తున్నాయి.కలిసి బ్రతకలేమనుకున్నప్పుడు ఒంటరిగా జీవితాన్ని నిలబెట్టి చూపించాలని ఎందుకు కోరుకోవడం లేదు..?కన్నవారిని చంపకుండా వారిని ఒప్పించి పెళ్లి చేసుకోకపోయినా చట్టబద్ధంగా అయినా పెళ్లి చేసుకొని దూరంగా ఉండి వాళ్ళ ఆశీర్వాదాలు పొందే రకంగా ఎందుకు ఆలోచించట్లేదు…?ఆత్మహత్య అయినా…. హత్య అయినా…. ప్రేమ కోసం హింస సరైన మార్గం కాదు కాకూడదు.ప్రేమలో త్యాగం ఉండాలి. ప్రేమలు ఆదర్శంగా ఉండాలి. అది సమాజానికి ఉపయోగపడేదిగా ఉండాలి. స్వార్థ ప్రయోజనాల కోసం ఒకరిని బల్లి తీసుకునేటటువంటి ప్రేమ ఎప్పటికి ప్రేమ అవ్వదు.
గొప్ప గొప్ప మహనీయులందరూ కూడా వాళ్ల జీవితాలను త్యాగం చేశారు. జీవిత భాగస్వాములకు ప్రేమను పంచారు. సమాజం లో మార్పు కోసం కలిసి నడిచారు.సమాజాన్ని ప్రేమించారు.సమాజంలో మార్పు కోసం వారి జీవితలను త్యాగం చేశారు.ఆస్తులు లేవని తమ హోదాకు సరైన వారు కారని చులకన చేసి ఆర్థిక అసమానతలకు దారితీస్తున్న అనేక సంఘటనలకు ప్రపంచంలో పేదరికం పోవాలని ఆర్ధిక సమానత్వం రావాలని పరితపిస్తున్న హృదయాన్ని ప్రేమించిన కామ్రేడ్ జెన్నీ మార్క్స్ తన జీవిత భాగస్వామి కారల్ మార్క్స్ ప్రేమ నేటి సమాజానికి ఆదర్శంగా నిలవాలి.సమాజంలో మార్పు స్త్రీ విద్య తోటే సాధ్యమవుతుందని భావించి అణగారిన వర్గాలకు చదువు నేర్పడానికి మొదటి ఉపాధ్యాయురాలుగా పయనమై సమాజంలో దురాచారాలను రూపుమాపడానికి అనేక అవమానాలను ఎదుర్కొని సావిత్రిబాయి పూలే తన జీవిత భాగస్వామి జ్యోతిరావు పూలే అతి చిన్న వయసులో పెళ్లి చేసుకున్న సమాజాన్ని ప్రేమించారు సమాజం కోసం ఒకరినొకరు అర్థం చేసుకున్నారు ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారు.అనేక ప్రేమ పెళ్లిళ్లలో విషాద గాధల వెనుకల కుల సమస్య ప్రధానంగా ఉంటుంది తక్కువ కులం వారిని పెళ్లి చేసుకున్నారని వేధింపులు గాని కుల దురహంకారం హత్యలు నిత్యం చూస్తూనే ఉంటాము కుల సమస్య పరిష్కారం కావాలని సామాజిక అసమానతలు రూపుమాపాలని ఈ దేశంలో అనగరిణ వర్గల కు మహిళల కు హక్కులు సంపాదించి పెట్టడం కోసం కృషి చేస్తున వేల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను అర్థం చేసుకొని తను శ్రమ చేస్తూ అంబేద్కర్ ను ప్రేమతో రమాబాయి ఆయనకు తోడుగా ఉన్నారు చరిత్రపుటల్లోకి వెళితే ఇట్లాంటి ఆదర్శ ప్రేమలెన్నో మనకు కల్పిస్తాయి వాటిని ఆదర్శంగా తీసుకొని సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి ప్రేమలు కానీ హింసకు ప్రతిరూపాలుగా నిలవకూడదు హింసను ప్రోత్సహించకూడదు. హింసను రూపుమాపుదాం!
ప్రేమను ప్రేమిద్దాం!!


