Listen to this article

జనం న్యూస్ //ఫిబ్రవరి //10//జమ్మికుంట //కుమార్ యాదవ్.. జమ్మికుంట జడ్పీ హైస్కూలు పాఠశాలకు చెందిన 1983 +84 బ్యాచ్ పదవ తరగతి విద్యార్థులు, 5వ వార్షికోత్సవ వేదిక గురువులకు సన్మానాన్ని నిర్వహించారు. విద్య నేర్పిన గురువులు విద్యాసాగర్, రాఘవులు శంకరయ్య లను స్వాగతించి సన్మానించారు.ఈ సందర్భంగా బాల్యం నాటి జ్ఞాపకాలను విద్యార్థులు గుర్తు చేసుకున్నారు. బాల్య మిత్రుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి 1983+ 84వ పదవ తరగతి బ్యాచ్ కు చెందిన ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులను ఈ సందర్భంగా సన్మానించారు .ఈ సందర్భంగా మాజీ జెడ్పి చైర్పర్సన్ కనుమల్ల విజయ మాట్లాడుతూ..నేడు విద్యా విషయంలో తల్లిదండ్రుల విధానం మారిందన్నారు. నాడు ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటూ పాఠశాలలో విద్యాభ్యాసం చేసేవారని నేడు కార్పొరేట్ కళాశాలలో విద్యాభ్యాసం చేయిస్తున్న పిల్లలు తల్లిదండ్రులకు దూరమవుతున్నారన్నారు. దీంతో బాల్యం నుంచే పిల్లలు తల్లిదండ్రులకు దూర మవుతున్నారన్నారు. కుట్టిమికులు బంధువుల విషయంలో ప్రేమ , ఆప్యాయత పెరగాలన్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థిని విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్నాయి, అని తెలిపారు.పలువు గురువులు లేవలేని స్థితిలో ఉండగా విద్యార్థులే వేదికపైకి తీసుకెళ్లారు . బాల్య మిత్రులు అపూర్వ కలయిక. 1983 +84 బాల్య మిత్రుల సేవాసమితి ప్రతినిధులు సంపత్ రావు, మంద వెంకటరెడ్డి,కనుమల్ల గణపతి,వట్టేపల్లి శ్రీనివాస్, గుండా సురేందర్, బత్తిని సాంబయ్య,ఎదులాపురం నరేందర్,వట్టెపల్లి ప్రకాష్,మట్ట వాసుదేవ రెడ్డి,గుడిమల్ల బలరాం,రావికంటి అశోక్ తదితరులు పాల్గొన్నారు.