

జనం న్యూస్ జనవరి 10 కుకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఈరోజు క్యాంపు కార్యాలయంలో ఇంజనీరింగ్, హార్టికల్చర్, ఎలక్ట్రికల్ అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో నియోజక వర్గంలో స్మశాన వాటిక లన్ని పరిశీలించాము అని, అరవై శాతం పనులు ర్తయ్యాయి, అన్ని స్మశాన వాటికల్లో బాలన్స్ పనులు పూర్తి చేయాలని ఇంకా నిధులు కావాలంటే అంచనాలు తయారు చేసి నాకు అందజేయాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రములో కార్పొరేటర్లు ముద్దం నరసింహ యాదవ్, ఆవుల రవీందర్ రెడ్డి, జూపల్లి సత్యనారాయణ, యం. సబిహా గౌసుద్దీన్, మాజీ కార్పొరేటర్లు పగడాల బాబురావు, తూము శ్రావణ్ కుమార్, ఇంజనీరింగ్ అధికారులు ఎస్ .సి చిన్న రెడ్డి, ఈఈ గోవర్ధన్, శ్రీనివాస్, డి .ఈ లు , ఎ.ఈ లు, హార్టికల్చర్, ఎలక్ట్రికల్ అధికారులు పాల్గొన్నారు