Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 15 చిలిపి చెడు మండల ప్రతినిధి

మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం లోని చండూరు గ్రామంలో ఆదివారం నుండి బుధవారం వరకు శ్రీశ్రీశ్రీ రామలింగేశ్వర స్వామి మహాశివరాత్రి ఉత్సవములు జరుపబడును ఓం నమశ్శివాయ. శ్లో వాగర్థా వివ సంప్రృత్తౌ వాగర్త ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సర మాఘ బహుళ త్రయోదశి ఆదివారము తేదీ 15- 2 -2026 రోజు నుండి తేదీ 18 -2 -2026 బుధవారం వరకు మహాశివరాత్రి శ్రీశ్రీశ్రీ రామలింగేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుగును.తేదీ 15 .2 .2026 ఆదివారం రోజు మహాశివరాత్రి ఉపవాస దీక్షలు మరియు ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు తిరిగి సాయంత్రం రాత్రి 9 గంటల నుండి తెల్లవారి స్వామి వరకి అభిషేకాలు సాయంత్రం ఐదు గంటలకు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు రాత్రి 8 గంటలకు శ్రీశ్రీశ్రీ రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరుగును తేదీ 16. 2 .2026 సోమవారం రోజు ఉదయం 11 గంటల నుండి అన్నదాన కార్యక్రమం జరుగును తిరిగి సాయంత్రం ఐదు గంటలకు బండ్లు తిరుగురు. తేదీ 17 .2 .2026 మంగళవారం రోజు ఉదయం 8 గంటలకు పాచి బండ్లు తిరిగి రాత్రి 9 గంటలకు రథోత్సవం జరపబడును.
తేదీ 18. 2 .2026 బుధవారం ఉదయం 9 గంటలకు పాచిరతం తిరుగుతుంది అలాగే ఆదివారం రాత్రి సమయంలో బీరప్ప నాటకం సాంస్కృతిక కార్యక్రమం జరుగుతుంది ఇట్టి కార్యక్రమమునకు గ్రామ ప్రజలు ఇరుగుపొరుగు గ్రామ ప్రజలందరూ కూడా విచ్చేసి అన్నదాన బండ్లు రథోత్సవము స్వామివారి అన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొని రామలింగేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము.ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాలు విజయవంతం చేయాలని కోరుతూ స్వామివారి కృపకు పాత్రులు కాగలరు