జనం న్యూస్ ఫిబ్రవరి 13: నిజామాబాద్ జిల్లా
వేల్పూరు మండలం:అంకాపూర్ వైదిక ధ్యానయోగ ఆశ్రమంలో మూడవ రోజు శనివారం అధర్వ వేద పారాయణ మహా యజ్ఞాన్ని శాస్త్రబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధరానంద భారతి స్వామి, వేద పునీతానంద భారతి స్వాములు భక్తులతో సత్సంగం నిర్వహించారు.స్వామీజీలు తమ ఆధ్యాత్మిక ప్రసంగంలో మాట్లాడుతూ, అన్ని ప్రాణుల్లో మానవుడు శ్రేష్టుడైనా అతని శ్రేష్టతకుఆధారంగోమాతమాత్రమేనని అన్నారు. ఆవు పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, జున్ను, మీగడ వంటి గోఉత్పత్తులు వాడకపోతే మానవ శరీరంలోని సప్త ధాతువులు శుద్ధి కావని, బుద్ధి కూడా పవిత్రం కాదని పేర్కొన్నారు. ఈ శుద్ధి అంతా గోఉత్పత్తుల ద్వారానే సాధ్యమవుతుందని తెలిపారు.భూమ్మీద ముక్కోటి దేవతలు కొలువై ఉన్న నడిచే ధర్మదేవత గోమాత అని, కానీ నేటి భారతదేశంలో గోరక్షణ పరంపర క్షీణించి గోభక్షకులు, గోవ్యాపారులుపెరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా గోహత్యనిషేధంపూర్తిస్థాయిలో అమలుకాకపోవడం దురదృష్టకరమని అన్నారు.భారతదేశం మళ్లీ ప్రపంచానికి జగద్గురువుగా నిలవాలంటే గోరక్షణ,గోపోషణఅత్యవసరమని, మానవత్వం బ్రతకాలన్నా, దైవత్వం వికసించాలన్నా గోమాత ఆశ్రయమే శరణ్యమని స్వామీజీలు పేర్కొన్నారు. ప్రజలంతా గోఉత్పత్తులను ఎక్కువగా వినియోగించి గోశాలల అభివృద్ధికి సహకరించాలన్నారు. ఇదే ప్రతి భారతీయుని కర్తవ్యమని స్పష్టం చేశారు.


