

ఫిబ్రవరి 10 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మైన బీరుపూర్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ కాళ్యాణ వేడుకలను ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు జాతర బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో ఆదివారం రాత్రి వేద పండితుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలను నిర్వహించారు ఆలయ ఆవరణం లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ మంటపం లో శ్రీ లక్ష్మీ నరసింహుని కళ్యాణ వేడుకలను అంగరంగా వైభోగంగా కన్నుల పండుగగా జరిపించారు ముఖ్యంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి పూర్వం నుండి నడుస్తున్న పద్దతి ప్రకారం నేరేల్ల గ్రామ వాస్తవ్యులు తలంబ్రాలు తీసుకువచ్చరు. ఈసందర్భంలో జగిత్యాల డిఎస్పి రఘచంధర్ స్వామివారికి పట్టువస్త్రాలు తలంబ్రాల తో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.మరియు ఎమ్మేల్సి కల్వకుంట్ల కవిత.ఎమ్మేల్సి ఎల్ రమణ. మాజీ జెడ్పిచేర్మెన్ దవ వసంత సురేష్ పాల్గొన్నారు.చుట్టూ పక్కల గ్రామాల నుండి వచ్చిన భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చి .స్వామి కళ్యాణంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్త కుండా సిఐ కృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో ఎసై కుమారస్వామి పోలీస్ సిబంది పర్యవేక్షించారు ఈకార్య క్రమంలో కార్య నిర్వహణా ధికారి సంకుటాల శ్రీనివాస్. ఆలయ పూజారి లు వొద్దిపర్తి పెద్దసంతోష్ చార్యులు, చిన్నసంతోష్ చర్యలు, మధు కుమార చార్యులు, మరియు మాజీ ప్రజా ప్రతి నిధులు నాయకులు అధికారులు భక్తులు అధిక సంఖ్య లోపాల్గొన్నారు.