జనం న్యూస్ ; 14 ఫిబ్రవరి శనివారం; సిద్ధిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ :
తెలంగాణ అస్తిత్వం: హాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రుస్తుం ఆర్ట్ గ్యాలరీ లో శనివారం ‘శివోహం’ క్యాన్వాస్ చిత్రాన్ని అంతర్జాతీయ చిత్రకారులు రుస్తుం ఆవిష్కరించి, అందరికి మహాశిరాత్రి శుభాకాంక్షలు తెలియజేసిరి, పండుగలు సంస్కృతిని కళావంతం చేస్తాయని మహాశివరాత్రి నాడు ఓం నమః శివాయ పంచాక్షరి జప నాదంతో అనుకున్నవి నెరవేరాలని కోరుకుంటూ, అభద్రతా భావాలను అధిగమిస్తూ, ఆధ్యాత్మిక భక్తి భావనలో పునీతులై భక్తులు ప్రతి జీవిలో శివశక్తి, సర్వేశ్వర విశ్వేశ్వర ఈశ్వర తత్వాన్ని దర్శించుకొని సోదర భావం, సహజీవనం, ఐకమత్యంతో మెదులుతారు. తద్వారా సమాజం వాసుధైక కుటుంభంగా ప్రపంచ నలుమూలలు యుద్దాలు కరువు కాటకాలు నిరుద్యోగ సమస్యలు సమసిపోయి సకలజనులు సోదరభావం ఎదుటివారి భావాలు గౌరవిస్తూ సుఖసంతోషాలతో శాంతిభద్రతలతో కష్ట సుఖాల్లో ఐక్యంగా ఉండాలని, తెలంగాణలో భక్తి పారవశ్యం ఆధ్యాత్మిక ఆర్థిక వనరుల సంక్షేమాలు అందరికి అందుతున్న తీరు భారతదేశానికి ఆదర్శం కావాలని దేశభక్తులు సేవాతత్పరులు, శాంతికాముకులు, సజ్జనులు భిన్నత్వంలో ఏకత్వం ఐక్యతను కోరుకుంటున్నారని మానవతా చిత్రకారులు రుస్తుం తెలియజేశారు. ఈ కార్యక్రమం లో ఆర్ ఎ ఎఫ్ అధ్యక్షురాలు జులేఖరుస్తుం, నైరుప్య చిత్రకారుడు నహీంరుస్తుం, అసిస్రెంట్ ప్రొఫెసర్ రుబినారుస్తుం, తదితరులు పాల్గొని మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.


