Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 14 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ

ఐ పోలవరం మండలం కేశనకుర్రు గ్రామములో వేంచేసియున్న శ్రీ మల్లమాంబా దేవి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా మూడు రోజులు త్రీ ఏకాహ భజన కార్యక్రమం నిర్వహించి శుక్రవారం అమ్మవారికి లక్ష కుంకుమార్చన చండీ హోమం నిర్వహించి భక్తులకు అన్న ప్రసాద వితరణ ఆలయ కమిటీ వారు గ్రామస్తులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా సమరసత సేవా ఫౌండేషన్ ముమ్మిడివరం సబ్ డివిజన్ ధర్మ ప్రచారక్ కనకారావు సాయంకాలం అమ్మవారి సన్నిధిలో బొంతు చంద్రరావు కానూరి వెంకటేశ్వరరావుల ఆర్థిక సహకారంతో దీపోత్సవ కార్యక్రమం నిర్వహించి ప్రసాద వితరణ చేయడం జరిగింది ఆలయ కమిటీ వారు దీపాలు అలంకరణ చేసిన పిల్లలను అభినందించడం జరిగింది.