జనం న్యూస్ ఫిబ్రవరి 14 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం
దక్షిణ కాశీగా పేరు పొందిన కుండలేశ్వరం పుణ్యక్షేత్రంలో మహా శివరాత్రి సందర్భంగా కాట్రేనికోన నుండి కుండలేశ్వరం వరకు ఉచిత ఆటో సదుపాయం ఏర్పాటు చేశామని కాట్రేనికోన శ్రీ సిద్ధార్థ ఆటో యూనియన్ అధ్యక్షుడు కొప్పాడి విగ్నేశ్వర రావు ఒక ప్రకటనలో తెలిపారు కాట్రేనికోన శ్రీ సిద్ధార్ధ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో కుండలేశ్వర స్వామి వారి ఆలయానికి వచ్చే భక్తులకు కాట్రేనికోన నుండి కుండలేశ్వరం శివాలయం వరకు ఉచితంగా 30 ఆటోలు నడుపుతున్నట్లు ఆటో యూనియన్ నాయకులు , నేలపాటి సురేష్,పాము శ్రీనివాస రావు,కాండ్రేకుల విజయ్ కుమార్,తెలిపారు


