జనం న్యూస్ ఫిబ్రవరి 14 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
దేశంలోనే వినూత్నమైన కొత్త వరవడితో శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్య ఐటీ శాఖ మాత్యులు నారా లోకేష్ శాసనసభ్యుల కుటుంబ సభ్యులతో ఆత్మీయ సమావేశంలో ఏర్పాటు చేసి వారి వారి కుటుంబ సభ్యులు వివరాలు తెలుసుకోవడం వారి నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై ఒక రిపోర్టును శాసనసభ్యులకు అందజేయడం నారా లోకేష్ కే చెల్లిందని మాజీ శాసనమండలి సభ్యులు బుద్ద నాగ జగదీశ్వరరావు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇటువంటి కార్యక్రమాన్ని భారతదేశంలో ప్రధాని మోడీ పార్లమెంటు సమావేశాలు జరిగినప్పుడు పార్లమెంటు సభ్యులు తో కలిసి విందు సమావేశాల్లో పాల్గొనేవారిని, దాన్ని ఆదర్శంగా తీసుకొని లోకేష్ మొట్టమొదటిసారిగా ప్రయోగాత్మంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారని, శాసనసభ్యుల కుటుంబ సభ్యులకు ఏనాడూ ఇటువంటి అవకాశాలు కలగలేదని, వారి కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా ఉంటూ పిల్లల భవిష్యత్తు ఆలోచన వారితో పంచుకోవడం, వారి కుటుంబంలో ఆనందంతో పాటు ఇటువంటి అవకాశాలు కూడా ఉంటాయని వారికి ఆలోచన కలిగించిన వ్యక్తి నారా లోకేష్ అని నాగ జగదీష్ అన్నారు. ప్రతి నియోజకవర్గంలో కూటమి శాసనసభ్యులు నియోజకవర్గాల్లో ఉన్న దీర్ఘకాలిక సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్న విషయాలను వారి చేయవలసిన పనులను తమ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం వారికి అందించి వారికి కర్తవ్యాన్ని బోధించారని, ఒక వ్యక్తి ఒక శాఖకు మంత్రిగా ఉంటూ 175 నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందని, లోకేష్ ధైర్యాన్ని, నిబద్ధత, సేవా, అంకితభావం తో పనిచేసే గుణం లోకేష్ కే దక్కుతుందని నాగ జగదీష్ అన్నారు. గత వైసిపి పాలనలో జగన్ రెడ్డి శాసనసభ్యులకు 5 సంవత్సరాల కాలములో ఏనాడు శాసనసభ్యులకు ముఖాముఖి కార్యక్రమంగానే, పాలకరింపులు గాని నోచుకోలేదని, జగన్ రెడ్డి పెత్తందారి విధానానికి నిదర్శనమని, దానికి భిన్నంగా లోకేష్ ప్రజాస్వామ్యతంగా అందరితో స్నేహ భావంతో ఉండడం లోకేష్ భవిష్యత్తు రాజకీయల కు మార్గదర్శకంగా ఉంటుందని నాగ జగదీష్ ఆశాభావం వ్యక్తపరిచారు.//


