హర్షం వ్యక్తం చేసిన పైలెట్లు (డ్రైవర్లు)
అనకాపల్లి కూటమి ప్రభుత్వం 2వేలు రూపాయలు జీతం పెంచడంతో ఆంధ్ర ప్రదేశ్ 108 అంబులెన్స్ సర్వీస్ పైలట్లు (డ్రైవర్లు) హర్షం వ్యక్తం చేశారు. శనివారం జిల్లా ఆసుపత్రి లో యూనియన్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా జిల్లా కోశాధికారి పీలా కోటేశ్వరావు మాట్లాడుతూ అతి తక్కువ జీతాలతో సతమతమవుతున్న అంబులెన్స్ పైలట్లకు 2వేలు పెంచి మా కుటుంబాలలో ఆనందం కలిగేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేశారన్నారు. భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సేవలు అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు తరగడంతో కుటుంబాలు ఇబ్బందులు పడేవున్నారు. ఈ తరుణంలో 2000 జీతం ప్రభుత్వం పెంచడంతో కూటమి ప్రభుత్వానికి ధన్యవాదములు తెలిపారు.ఈ కార్యక్రమంలో మచ్చ శ్రీనివాసరావు, ఆకుల నారాయణరావు, జాగు విష్ణు మణికుమార్, వి అప్పలరాజు, ఎస్ సీతారాం, నారపల్లి సూరిబాబు, కరణం సూరిబాబు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.//


