జనం న్యూస్ నందలూరు కడప జిల్లా.14-02-26
విజయవాడలో జరిగిన ప్రతిష్టాత్మక రాష్ట్రస్థాయి అబాకస్ మరియు వేదిక్ మాథ్స్ పోటీలలో నంద లూరుకు చెందిన విజ్డం స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి పాఠశాల పేరును రాష్ట్రస్థాయిలో మారుమోగించారు. సుమారు 950 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలలో విజ్డం పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు టాప్ ర్యాంకులు సాధించడం విశేషం.విజేతల వివరాలు:జనవరి 4న జరిగిన జిల్లా స్థాయి పోటీలలో రాణించి, రాష్ట్రస్థాయికి ఎంపికైన ఈ విద్యార్థులు విశ్వం ఈడుటెక్ నిర్వ హించిన ఫైనల్స్‌లో తమ సత్తా చాటారు:జాశ్రీత మణిశ్రీ: రాష్ట్రస్థాయి అబాకస్ లొ రెండవ స్థానం (2nd Rank) సాధించి రికార్డు సృష్టించింది. పి. శశాంత్: విజిలైజేషన్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో మూడవ స్థానం (3rd Rank) కైవసం చేసుకున్నారు.పట్టుదలకు దక్కిన ఫలితం:ఈ సందర్భంగా పాఠశాల కరస్పాం డెంట్ వల్లిమి రాధ మాట్లాడుతూ, విద్యార్థులలోఉన్నసృజనాత్మకతను వెలికితీయడమే లక్ష్యంగా తాము అందిస్తున్న శిక్షణకు ఈ విజయం నిదర్శనమని పేర్కొన్నారు. విద్యార్థుల పట్టుదల, ఉపాధ్యా యుల కృషి వల్లే ఈ ఘనత సాధ్యమైందని ఆమె హర్షం వ్యక్తం చేశారు.మా విద్యా ర్థులు 950 మంది పోటీ దారులను తట్టుకుని రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించడం గర్వ కారణం. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించేలా వారిని తీర్చిదిద్దుతాం.వలిమి రాధ (కరస్పాండెంట్, విజ్డం స్కూల్)రాష్ట్రస్థాయిలో రాణించిన విద్యార్థులను, వారి తల్లి దండ్రులను పాఠశాల యాజ మాన్యం, ఉపాధ్యాయ బృందం మరియు స్థానికులు ఘనంగా అభినందించారు.ఈ కార్య క్రమంలో మ్యాథ్స్ టీచర్ అనురాధ తదితరులు పాల్గొన్నారు.


