Listen to this article

పోలీసు సిబ్బంది బందోబస్తు విధులు అప్రమత్తంగా నిర్వహించాలి. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఐపీఎస్,.

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు ఫిబ్రవరి 14 సెల్ 9550978955

కోటప్పకొండ తిరునాళ్ళు బందోబస్తును గురించి గౌరవ ఎస్పీ పోలీసు అధికారులు మరియు సిబ్బందికి బ్రీఫింగ్ చెయ్యడం జరిగింది.బందోబస్తుకు హాజరయ్యే ప్రతి ఒక్క పోలీస్ అధికారి మరియు సిబ్బంది తమకు కేటాయించిన విధులను శక్తి వంచన లేకుండా నిర్వహించేందుకు అధికారులు తమకు కేటాయించిన సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని సూచించారు.పోలీస్ అధికారులు తమ విధి నిర్వహణ ప్రదేశంలో ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు వెంటనే కమాండ్ కంట్రోల్ కేంద్రానికి సమాచారం అందించి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.మహా శివరాత్రి బందోబస్తు విధులపై బ్రీఫింగ్ అనంతరం ఎస్సైలు మరియు పై స్థాయి పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఐపీఎస్ సమన్వయ సమావేశం నిర్వహించి, పలు కీలక సూచనలు చేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ బందోబస్తు విధులను ప్రతిష్టాత్మకంగా తీసుకొని అత్యంత అప్రమత్తతతో నిర్వహించాలని సూచించారు.
“Firm with Politeness” అనే సూత్రాన్ని అనుసరిస్తూ, విధి నిర్వహణలో దృఢంగా వ్యవహరించడమే కాకుండా, తిరునాళ్లకు హాజరయ్యే భక్తులతో మరియు ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని తెలిపారు.ప్రతి సెక్టార్‌కు కేటాయించబడిన పోలీస్ అధికారులు తమ విధులపై, విధి నిర్వహణ ప్రదేశాలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని, తమకు కేటాయించిన సిబ్బందితో పాటు పక్క సెక్టార్ల అధికారులతో సమన్వయంతో విధులు నిర్వహించాలని ఆదేశించారు.ఏదైనా సెక్టార్‌లో ఆకస్మిక ఘటన చోటు చేసుకున్నప్పుడు,పక్క సెక్టార్‌లకు చెందిన పోలీస్ అధికారులు మరియు సిబ్బంది వెంటనే స్పందించి, సంఘటనా స్థలానికి చేరుకొని సహకరించాలని తెలిపారు.భక్తులకు మరియు ప్రజలకు ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, రోడ్లపై అక్రమ పార్కింగ్ లేకుండా నిరంతర పెట్రోలింగ్ నిర్వహించాలని సూచించారు.సున్నిత ప్రాంతాలలో ప్రత్యేక భద్రత బృందాలతో (Special Security Teams, BD Teams) ముందస్తు విధ్వంస నిరోధక తనిఖీలు (Anti-Sabotage Checks) నిర్వహించి, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన ముందస్తు భద్రత చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.వాహనాల పార్కింగ్ ప్రాంతాలలో పోలీసులు అప్రమత్తంగా ఉండి, వాహనాలను సక్రమంగా పార్కింగ్ చేయిస్తూ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూడాలని, అవసరమైన చోట్ల దిశా నిర్దేశక చిహ్నాలు (Sign Boards) ఏర్పాటు చేసినట్లు తెలిపారు.బందోబస్తు విధులకు హాజరయ్యే పోలీస్ అధికారులు మరియు సిబ్బంది తప్పనిసరిగా ఐడీ కార్డులు కలిగి ఉండాలని, విజిల్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలని తెలిపారు.కమ్యూనికేషన్ వ్యవస్థపై నిరంతరం దృష్టి సారించి, విధి ప్రదేశంలో ఏదైనా అసాధారణ ఘటన సంభవించినట్లయితే వెంటనే కమ్యూనికేషన్ కంట్రోల్ ద్వారా ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ తో పాటు అదనపు ఎస్పీ (అడ్మిన్) JV.సంతోష్ ట్రైనీ ఎస్పీ నిరంజన్ అదనపు ఎస్పీ (ఏ.ఆర్) V. సత్తి రాజు అదనపు ఎస్పీ (క్రైం)లక్ష్మీపతి ఇతర డిఎస్పీలు,సీఐలు,ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.