

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 10 రిపోర్టర్ సలికినిడి నాగరాజు తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం తృతీయ వార్షికోత్సవం విజయవాడలోని ఠాగూర్ గ్రంథాలయంలో ఈ నెల 7వతేదీన ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర స్థాయి నూతన కమిటి ఎన్నిక జరిగింది. దానిలో భాగంగా పల్నాడు జిల్లా చిలకలూరిపేట తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షులు గా పని చేస్తున్న బి. శ్రీను నాయక్ ను రాష్ట్ర సహాయ కార్యదర్శిగా తీసుకోవటం జరిగింది.ఈ మేరకు పట్టణంలోని ఎన్నార్టీ రోడ్లో గల అమృత పంజాబీ ఫ్యామిలీ దాబా లో తెలుగు సంక్షేమ సంఘం కమిటీ సభ్యులు, పలువురు ప్రజా సంఘాల నాయకులు ఆదివారం బి.శ్రీను నాయక్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కష్టపడితే ప్రతిఫలం వచ్చిది అనే దానికి నాయక్ యే ప్రధాన ఉదాహరణ అన్నారు.. సమర్థవంతంగా ప్రజా సమస్యలపై పత్రికా రూపేణ,పోరాట రూపంలో ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లే వ్యక్తి అని నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాయక్ మాట్లాడుతూ తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగా నాయకులు 2022లో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా ముందుకు తీసుకెళుతున్నారన్నారు. నాడు ఈ యూనియన్ ఎక్కడ ఉందని చెప్పిన ప్రతి ఒక్కరికి ఈ నూతన సంవత్సరం 2025లో మేము వేసిన క్యాలెండర్ నిదర్శనం అన్నారు. మరింత బలోపేతంగా యూనియన్ ని ముందుకు తీసుకెళ్తామన్నారు. ఎవరు చేయలేని పని తమ యూనియన్ ద్వారా ముందుకు తీసుకెళ్తామన్నారు. విమర్శకు.. ప్రతి విమర్శ తప్పకుండా ఉంటుందని హెచ్చరించారు.. మేడవరపు రంగనాయకులకు, రాష్ట్ర ,జిల్లా ,పేట, కమిటీ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట తెలుగు సంఘం జర్నలిస్టుల సంక్షేమ సంఘం కమిటీ సభ్యులు, బాపూజీ వృద్ధాశ్రమం కార్యదర్శి మురికిపూడి ప్రసాద్, ఇతర ప్రజా సంఘాల నాయకులు వివిధ రాజకీయ పార్టీ నేతలు పాల్గొన్నారు.