Listen to this article

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 14 ఫిబ్రవరి

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో అమర జవాన్ స్తూపం వద్ద పుల్వామా అమరులకు నివాళులు అర్పించారు.మన దేశాన్ని నిరంతరం రక్షణ గా ,భద్రంగా ప్రతి జవాను కాపల కాస్తుంటారు. ఎన్నో కష్టాలు భరించి ,ఏడారుల్లో ఎండల్లో ఉండే జవానులపై జరిగిన దాడి ఫిబ్రవరి 14, 2026 నాటికి సరిగ్గా ఏడేళ్లు పూర్తయ్యాయి. 2019, ఫిబ్రవరి 14న జరిగిన ఈ అతిపెద్ద ఉగ్రవాద దాడిలో 40 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. ఈ దాడికి ప్రతీకారంగా, పాకిస్థాన్‌పై భారత్ కఠిన చర్యలు చేపట్టింది. భారత సైన్యం పాకిస్థాన్‌లోకి చొరబడి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ సంఘటనలు ప్రతి భారతీయుడిలోనూ ఆగ్రహాన్ని రేకెత్తించాయి.ఈ పుల్వామా అమర జవాను ల ను నేటి యువత కు స్ఫూర్తి గా ఉండాలని పలువురు సూచించారు.ఈ కారిక్రమంలో ఎస్సి ఎస్టి, బిసి జాక్ చైర్మన్ డా.పెద్దగొల్ల నారాయణ, వశిష్ఠ డిగ్రీ కళాశాల డైరెక్టర్ మారుతీరావు,సర్పంచ్ రవి పాటిల్,బుడగజంగం నాయకులు మాదినం శివప్రసాద్,జనసేన నాయకులు శంకర్ సాగర్,మహింద్రా కార్మికులు కదిర్,సజ్జపూరం గోపాల్,మల్కపురం బాలకృష్ణ,బోయిని గోపాల్ ,గంజీ మహేష్,సాయి బండారి,గౌడ్ తదితరులు పాల్గొన్నారు.