Listen to this article

జనం న్యూస్ ;14 ఫిబ్రవరి శనివారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్;

ఎంత కష్టమైనా, ఇష్టంగా చదివితే ఉన్నతులుగా ఎదుగుతారని యాదవ ఎంప్లాయిస్ సొసైటీ అధ్యక్షులు బైరి అనీల్ కుమార్ యాదవ్ అన్నారు. జువాలాజీలో పరిశోధన చేసి, డాక్టరెట్ పొందిన బంక శ్రీశైలం యాదవ్ ను సిద్దిపేటలో సత్కరించారు. బాలసాహితీవేత్త ఉండ్రాళ్ళ రాజేశం మాట్లాడుతూ ఎంతో కష్టపడి ఉన్నతులుగా ఎదిగిన డాక్టర్ శ్రీశైలం యాదవ్ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. సందేబోయిన రాజు యాదవ్, అక్కెం ఐలయ్య యాదవ్, దాసరి రాజు యాదవ్, తలారి చంద్రశేఖర్ యాదవ్, నూనే రాజయ్య యాదవ్, ధారబోయిన రాజు యాదవ్, బైరు సత్తయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.