Listen to this article

జనం న్యూస్ ;14 ఫిబ్రవరి శనివారం:సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వైరమేష్ ;

బాలసాహిత్యంలో విశేష కృషి చేస్తున్న సిద్దిపేట బాలసాహితీవేత్తలను తెలంగాణ సారస్వత పరిషత్ శాశ్వత సభ్యులు గరిపల్లి అశోక్ అభినందనలు తెలిపారు. సిద్దిపేటలో జరిగిన బాలసాహితీవేత్తల సమావేశంలో గరిపల్లి అశోక్ మాట్లాడుతూ సిద్ధిపేట బాలసాహిత్యానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుండడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. బాలల దినోత్సవం సందర్బంగా తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురించిన బాలల ప్రపంచం పుస్తకావిష్కరణ చేశారు. కార్యక్రమంలో బాలసాహితీవేత్తలు ఉండ్రాళ్ళ రాజేశం, పెందోట వెంకటేశ్వర్లు, బైతి దుర్గయ్య, వరుకోలు లక్ష్మయ్య, అనిశెట్టి సతీష్, లింగేశ్వరశర్మ, శ్రీనివాస్ రెడ్డి, జెగ్గారి నిర్మల, సత్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.