జనం న్యూస్ 16 ఫిబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
జోగుళాంబ గద్వాల్ జిల్లా పోలీస్ శాఖ ప్రజాస్వామ్య ప్రక్రియను ప్రశాంతంగా, నిర్భయంగా నిర్వహించేందుకు కట్టుబడి ఉందని జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు, ఐపిఎస్., తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పోలీస్ శాఖ అప్రమత్తంగా పనిచేస్తుందని తెలిపారు.జిల్లాలోని గద్వాల్ పట్టణం, అయిజ, శాంతినగర్, అలంపూర్ మున్సిపాలిటీలలో తేది:11-02-2026న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించబడగా, తేది:13-02-2026న ఓట్ల లెక్కింపు ప్రక్రియ విజయవంతంగా పూర్తి కావడం జరిగింది. గెలుపొందిన అభ్యర్థులు తమ తమ మున్సిపాలిటీలలో చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నుకునే ప్రక్రియ తేది:16-02-2026న ఇ రోజు జరగనున్న నేపథ్యంలో జిల్లా పోలీస్ శాఖ అప్రమత్తమై ప్రత్యేక భద్రతా చర్యలు అమలు చేస్తోంది అని జిల్లా ఎస్పీ తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా మూడు అంచెల భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. చైర్మన్–వైస్ చైర్మన్ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో మరియు పరిసర ప్రాంతాల్లో 163 బి.ఎన్.ఎస్.ఎస్ (పూర్వం 144 సి.ఆర్.పి.సి) అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నిబంధనల ప్రకారం నలుగురు కంటే ఎక్కువ మంది గుంపులుగా గుమికూడడం పూర్తిగా నిషేధం. అదేవిధంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా అమలులో కొనసాగుతుందని, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంతవరకు అన్ని ఆంక్షలను ఖచ్చితంగా పాటించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎస్పీ హెచ్చరించారు.మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల పక్రియ అనంతరం అభ్యర్థులు లేదా వారి అనుచరులు విజయోత్సవ ర్యాలీలు, భారీ సభలు, బైక్ ర్యాలీలు, శోభాయాత్రలు, డీజే కార్యక్రమాలు నిర్వహించడం పూర్తిగా నిషేధమని తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడతాయని స్పష్టం చేశారు.జిల్లాలోని ప్రతి పౌరుడు చట్టాలను గౌరవించి ఇట్టి ప్రజాస్వామ్య బద్ధమైన ఎన్నికకు ప్రజాస్వామ్య బద్ధంగా సహకరించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు….పి ఆర్ ఓజిల్లా పోలీస్ కార్యాలయం,జోగుళాంబ గద్వాల్ జిల్లా.


