Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 16 ముమ్మిడివరం ప్రతినిధి క నానాజీడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా

ముమ్మిడివరం నియోజకవర్గంఐ పోలవరం మండలం కేశనకుర్రుపాలెం గ్రామంలో శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో 29.12.2025 నుండి ఈరోజు వరకు క్రీ” శే” గరగ శేషగిరిరావు (గురువు) దివ్య ఆశీస్సులతో భక్తుల సహాయ సహకారంతో గాదిరాజు విశ్వనాథరాజు ఆధ్వర్యంలో ఉగాది రాజు శ్రీరామరాజు పర్యవేక్షణలో సప్తసప్తహం అనగా 49 రోజులు అఖండ సర్వనామ మహోత్సవము నిర్విఘ్నంగా నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో అనేక గ్రామాల నుండి భజన కళాకారులు పాల్గొని నామ సంకీర్తన చేసినారు ఈ కార్యక్రమం లోక కళ్యాణ అర్థం గ్రామం అందరూ ఆయురారోగ్యాలతో సిరు సంపదలతో సుభిక్షంగా ఉండాలని ఈ కార్యక్రమం తలపెట్టినట్లు విశ్వనాథరాజు తెలియజేశారు ఈ సందర్భంగా వేగిరాజు సత్యనారాయణరాజు (పెద్దబ్బాయి) భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు అర్చకస్వామి కామేశ్వర్ శర్మ చే పార్వతీ పరమేశ్వరుల శాంతి కల్యాణం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సలాది బ్రహ్మానందరావు ఆలయ ధర్మకర్త శ్రీ వేగిరాజు గణపతిరాజు అక్కిరెడ్డి స్వామి సమరసత సేవా ఫౌండేషన్ ధర్మ ప్రచారక్ బి కనకారావు లు పాల్గొన్నారు