Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 16 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

ఈనెల 22 తేదీన జరిగే బిసి సింహగర్జన సభ ను విజయవంతం చేయమని ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మెల్లి రమణబాబు తెలిపారు. అజెండా : – బీసీ రక్షణ చట్టం అమలు, బీసీ కులాల కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణన, విద్య ఉద్యోగాలు, స్థానిక సంస్థలు చట్టసభల్లో బీసీలకు 44% రిజర్వేషన్లు; కల్పించాలని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా, విజయవాడ – గుంటూరు హైవే దగ్గర ఉన్న పూలే అంబేద్కర్ మండల్ కర్పూరి ప్రాంగణం లో జరిగే సభకు తరలి రావాలని,20% జనాభా ఉన్న ఓసీలు చట్టసభల్లో 60% ఉండగా, 60% ఉన్న బీసీలు చట్టసభల్లో కేవలం 20% మాత్రమే ఉన్నారు.స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు కావస్తున్న ఇంత వరకు బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు లేవు.అధిక మొత్తంలో జనాభా ఉన్నా కూడా బీసీలకు సీట్లు కేటాయించకపోడం శోచనీయం.మిగతా రాష్ట్రాలతో పాటు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా బీసీలు సామాజికంగా చట్టసభల్లో బలపడాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రంలో కూడా బలమైన జననాయకులు బీసీలు అందరు ఐకమత్యంగా తోడ్పాటు సమకూర్చి బలంగా నిలబడి మన ఆత్మగౌరవాన్ని మనమే పెంపొందించుకోవాలి….22వ తేదీన జరిగే బీసీ సింహ గర్జన జయప్రదం చేయవలసినదిగా తెలిపారు.