జనం న్యూస్ ఫిబ్రవరి 16 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
రాష్ట్ర బడ్జెట్ లో గతంలో ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టలేని విధంగా నేడు కూటమి ప్రభుత్వం బడ్జెట్లో విశాఖకు సింహ భాగo 28 వేల కోట్లు కేటాయించి, విశాఖను దేశంలో ఆర్థిక రాజధానిగా, హైటీ హబ్ గా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్య ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని బడ్జెట్ లో నిధులు కేటాయించడం హర్షనీయమని మాజీ శాసన మండలి సభ్యులు బుద్ధ నాగ జగదీశ్వరరావు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఇప్పటికే దాదాపు పది జిల్లాలతో విశాఖ ఆర్థిక కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు భారీ కేటాయింపులు చేయడం ద్వారా ఏ స్థాయిలో విశాఖకు ప్రాధాన్యత కల్పిస్తున్నారో అర్థమవుతుందని, 2032 నాటికి విశాఖలో 120 బిలియన్ డాలర్ సంపద సృష్టించాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంతో ముందుకు సాగుతుందని నాగ జగదీష్ అన్నారు. విజన్ 2047 లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని, ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ వ్యవసాయం, సాగునీటి రంగం, విద్య వైద్యం రంగాలను బలోపేతం చేస్తూ యువతకు 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చే విధంగా పెట్టుబడులను ఆకర్షిస్తూ, ఈ బడ్జెట్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపేందుకు దోహదపడుతుందని నాగ జగదీశ్ అభిప్రాయపడ్డారు. అన్ని వర్గాల సమగ్ర అభివృద్దె లక్ష్యంగా 3,32,205 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ ను అభినందిస్తున్నామని, బడుగు బలహీన హరిజన గిరిజన ప్రజలకు ఈ బడ్జెట్ లో బీసీల సమగ్రాభివృద్ధికి 51,021 కోట్లు ఎస్సీ సంక్షేమం కోసం 20,644, ఎస్టీ సంక్షేమం కోసం 9,190, మహిళా శిశు వికలాంగుల సంక్షేమానికి 4,582 కోట్లు మైనారిటీ సంక్షేమం కోసం 6090 కోట్లు మొత్తం సంక్షేమానికి బడ్జెట్ లో 91,527 కోట్లు కేటాయించడం జరిగిందని గతంలో ఏ ప్రభుత్వం ఇంత భారీ సంక్షేమ నిధులు కేటాయించిన దాఖలు లేవని నాగ జగదీష్ గంటపదంగా తెలియజేశారు. విలేకరుల సమావేశంలో బోడి వెంకటరావు కోట్ని రామకృష్ణ గుడాల సత్యనారాయణ సారిపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.//


