Listen to this article

▪️ సైబర్ సెక్యూరిటీ బ్యూరో..డి. ఎస్పీ.. పింగిలి ప్రశాంత్ రెడ్డి..

జనం న్యూస్ //ఫిబ్రవరి //10//జమ్మికుంట //కుమార్ యాదవ్..ఈమధ్యన కొత్తగా సైబర్ నేరగాళ్లు మరో కొత్త మోసానికి తెర లేపారు. సైబర్ నేరగాల్ల పట్ల జాగ్రత్త వహించకపోతే, ఇక అంతే సంగతులు.. ఇప్పుడు కొత్తగా,మీదగ్గర వుండే కరెన్సీ నోట్లలో వాళ్ళు చెప్పే మూడు చివరి అంకెలు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ( ఆర్బిఐ ) మీకు 10/12 లక్షల రూపాయలిస్తుందని, మీరు కొంత ప్రాసెసింగ్ ఫీజ్, (జీఎస్టీ )కట్టాల్సి వుంటుందని, ఒక అకౌంట్ నంబర్ చెప్పి దానికి వారు కోరినంత డబ్బులు ట్రాన్స్ఫర్ చెయ్యమని అడుగుతారని డి. ఎస్పీ పింగిలి ప్రశాంత్ రెడ్డి, తెలిపారు. ”ఇదంతా పచ్చి మోసం. ఎవరూ ఇలాంటి మోసాల బారిన పడకండి, జాగ్రత్తగా ఉండాలి, ఇదే కాదు కొత్త వ్యక్తులు, తెలియని ఫోన్ నంబర్లనుండి ఆడియో, వీడియో కాల్స్ చేసి, ఆశపెట్టినా, బెదిరించినా జంకక, గొంకక ఉండాలి, ప్రలోభాలకు లొంగొద్దు అవసరమైతే సమీప పోలీస్ స్టేషన్లో కెళ్ళి విషయం వివరంగా చెప్తే సరియైన సలహా/ సాయం పొందొచ్చు”అని వివరించారు. ఆలాంటి ఫోన్ కాల్స్ కు స్పందించకపోవడం, వాటిని బ్లాక్ చేస్తే చాలా మంచిది, ఒక వేళ అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నా మోసపోతే. 1930 కి వెంటనే ఫోన్ చేసి సాయం పొందొచ్చు” అని పేర్కొన్నారు.డి ఎస్పి, సైబర్ సెక్యూరిటీ బ్యూరో.. పింగిలి ప్రశాంత్ రెడ్డి.