జనం న్యూస్ (బెజ్జరపు శ్రీనివాస్ స్టాఫ్ రిపోర్టర్ ) ఫిబ్రవరి 16, జగిత్యాల జిల్లా :
జగిత్యాల జిల్లాలో ఇటీవల నిర్వహించిన పురపాలక ఎన్నికల అనంతరం మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ పదవులకు సోమవారం జరిగిన ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలలో నూతన ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడ్డారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి: జగిత్యాల మున్సిపాలిటీ:చైర్మన్‌గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి “సమీండ్ల వాణి” మరియు వైస్ చైర్మన్‌గా “జీనత్ ప్రవీణ్” ఎన్నికయ్యారు.*కోరుట్ల మున్సిపాలిటీ*:చైర్మన్‌గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి “తిరుమల వసంత గంగాధర్” మరియు వైస్ చైర్మన్‌గా మహమ్మద్ షహీద్ ఎంపికయ్యారు.*మెట్ పల్లి* మున్సిపాలిటీ:చైర్మన్‌గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి “మైలారపు లింబాద్రి” మరియు వైస్ చైర్మన్‌గా “ఓంకారి నవీన్” ఎన్నికయ్యారు.*రాయికల్ మున్సిపాలిటీ*:చైర్మన్‌గా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి “కటకం రవీందర్” మరియు వైస్ చైర్మన్‌గా తురగా సౌజన్య ఎంపికయ్యారు.*ధర్మపురి మున్సిపాలిటీ*:చైర్మన్‌గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి “వేముల నాగలక్ష్మి” మరియు వైస్ చైర్మన్‌గా “ఇందారపు నాగన్న” ఎంపికయ్యారు.ఈ రోజు ఎన్నికైన చైర్మన్లు మరియు వైస్ చైర్మన్లు ఈ రోజు నుండే అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, పారదర్శక పాలన అందించేందుకు కట్టుబడి ఉంటామని వారు తెలిపారు


