Listen to this article

జనం న్యూస్ 10 ఫిబ్రవరి కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి( కుర్రిమెళ్ళ శంకర్ ) తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. సంక్షేమ పథకాల అమలులో అధికారుల కు కీలక సూచనలు చేస్తోంది. ఎన్నికల వేళ ఇచ్చిన హామీల అమలు దిశగా కసరత్తు కొనసాగు తోంది. అందులో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ విషయంలో తాజాగా అధికారులకు కీలక సూచనలు అందాయి. ప్రతీ మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి లబ్దిదారుల జాబితాను సిద్దం చేసారు. ఇక, ఈ గ్రామాల్లో ఇళ్ల గ్రౌండింగ్ కోసం ఏర్పాటు ప్రారంభించారు. ముందుగా ఆ గ్రామాల్లో ప్రీ గ్రౌండింగ్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారలు కోసం ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రీ గ్రౌండింగ్ సమావేశాల నిర్వహణ దిశగా కసరత్తు చేస్తోంది. ఎంపికైన లబ్దిదారుల ఇళ్ల నిర్మాణం లో అనుసరిం చనాల్సిన విధానాలు.. నిర్మాణ సామాగ్రి.. ఎలా నిర్మాణం చేపట్టాలనే వాటితో పాటుగా వారి సందే హాలకు పరిష్కారం చూపేలా ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే లబ్ది దారులకు పథకం అమలుకు సంబంధించి విధి విధానాలు ఖరారు చేసింది. అందులో భాగంగా ఇందిరమ్మ యాప్‌ సర్వే సమయంలో సొంత స్థలం చూపిన ప్రాంతంలో లబ్ధిదారుడే ముగ్గు పోసుకోవాల్సి ఉంటుంది. లబ్ధిదారుడు మరోచోట ఇల్లు కట్టుకుంటానంటే ఆ ఇంటిని అధికారులు రద్దు చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు తమ స్థలంలో లబ్దిదారుడు ముగ్గు పోసుకొని సిద్దమైన తరువాత సమాచారం ఇస్తే గ్రామ కార్యదర్శి అక్కడకు వచ్చి వారిని ఫొటోలు తీసుకొని ఆన్‌లైన్‌లో వివరాలను నమోదు చేస్తారు. నిర్మాణ ప్రదేశాన్ని జియో ట్యాగింగ్‌ చేసి ఇస్తారు. అదే విధంగా ప్రతీ లబ్దిదారుడు కనీసం 400 చదరపు అడుగులు కంటే తక్కువ కాకుండా ఇంటిని నిర్మించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసారు. పునా ది పూర్తయిన తర్వాతే మొదటి విడతలో రూ.లక్షను లబ్ధిదారుడి ఖాతాలో ప్రభుత్వం జమ చేయనుంది. ప్రతి ఇంటికి 8 ట్రాక్టర్ల ఇసుకను అందించాలని నిర్ణయించగా, దీనికి సంబంధించి కూపన్లను తహసీల్దార్‌ లేదా ఆర్డీవో ద్వారా అందించాలని స్పష్టం చేసారు. నియోజకవర్గాల వారీగాప్రభుత్వం మొదటి విడతలో 71,482 ఇళ్లను ఇవ్వాలని నిర్ణయించింది. కాగా, ఇందులో 21 నియోజకవర్గాల్లో 1000కి పైగా ఇళ్లను ఇవ్వనుంది. హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో 2,528 ఇళ్లు , మంథని 1,952, బోథ్‌ 1,538, పరకాల 1,501 ఇళ్ల పంపిణీకి నిర్ణయించారు. ఆ తరువాత వరుసగా హుస్నాబాద్‌, సిర్పూర్‌, దుబ్బాక, పరిగి, బెల్లంపల్లి, జహీరాబాద్‌ వంటి నియోజకవర్గాల ల్లో ఇళ్లను ఇవ్వాలని నిర్ణయించారు. మిగిలిన నియోజకవర్గాల్లో వెయ్యి వరకు ఇళ్లను ఇచ్చేందుకు ఎంపిక చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై కసరత్తు కొనసాగుతున్న వేళ పథకాల అమలు విషయంలో కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి.