జనం న్యూస్జహీరాబాద్, ఫిబ్రవరి 16:
మహాశివరాత్రి సందర్భంగా శ్రీ భక్త మార్కండేశ్వర మందిరంలో సోమవారం ఉదయం ఆలయ అర్చకులు వేణు భట్ ఆధ్వర్యంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు గడ్డం జనార్ధన్ దంపతుల ద్వారా ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించినారు. ఈ సందర్భంగా రాత్రి 12 గంటల నుండి లింగోద్భవ సమయంలో వేద బ్రాహ్మణోత్తములచే మహాన్యాస పూర్వక లఘు రుద్రాభిషేకం కార్యక్రమాలను గడ్డం సరిత,గోపాల్ దంపతులు నిర్వహించారు .ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు పండాల్ ప్రభు, దండి విట్టల్ , ప్రణాళిక సంఘం సభ్యులు సోమచంద్రశేఖర్, సభ్యులు గద్దె వెంకటేశం, అప్పం శ్రీకాంత్ , అప్పం రమేష్, యెన్నం ప్రకాష్, యెన్నం రఘు,మేనేజర్ నీలిరాజేశ్ తదితరులు పాల్గొన్నారు.


