

జనం న్యూస్ 10 ఫిబ్రవరి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా గొంగళ్ళ రంజిత్ కుమార్ నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో 15వ రోజు నిరవధిక సమ్మెకు మద్దతు తెలిపిన గొంగళ్ళ రంజిత్ కుమార్ జోగులంబ గద్వాల గత 15 రోజుల నుండి తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్నటువంటి నిరవధిక సమ్మెలో భాగంగా ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో రాజీవ్ మార్గ్ రోడ్డులో చేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మెకు నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ మద్దతు ప్రకటిస్తూ సంఘీభావం ప్రకటించారు. *ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….*విద్యారంగ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా 20వేల మంది జిల్లాలో 455 మంది వివిధ స్థాయిలలో కాంట్రాక్టు పద్ధతిలో చేస్తున్నా సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయాలని అన్నారు.గత 18 సంవత్సరాల నుండి విద్యారంగంలో సేవ చేస్తున్నటువంటి వీరి న్యాయబద్ధమైన డిమాండ్ ను పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నదని ప్రస్తుత ముఖ్యమంత్రి గతంలో ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రెగ్యులరైజ్ చేస్తామన్న హామీని నెరవేర్చాలని అన్నారు.ఇప్పటికే కే.జీ.బీ.వీ మరియు యు.ఆర్.ఎస్ పాఠశాలల్లో విద్యాబోధన కొనసాగకపోవడంతో బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి చర్చలకు ఆహ్వానించి వీరి డిమాండ్ ను నెరవేర్చాలని అన్నారు.స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్ గారు న్యాయబద్ధమైన డిమాండ్ నురాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలని,అలాగే స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని,అవసరమైతే కలెక్టరేట్ కార్యాలయం ముట్టడికైనా సిద్ధం కావాలని అన్నారు. నడిగడ్డ హక్కుల పోరాట సమితి మీయొక్క న్యాయబద్ధమైన డిమాండ్ల సాధనకై మీ వెంట నడుస్తుందని అన్నారు. జిల్లాలో సుమారు 455మంది ఉద్యోగులు గత 15 రోజుల నుంచి రోడ్లపై టెంట్లు వేసుకొని సమ్మె చేస్తున్న ఇప్పటిదాకా స్థానిక ఎమ్మెల్యే గారు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకపోవడం గర్హనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు హుస్సేనప్ప,మహిళా అధ్యక్షురాలు ఎస్పీ ప్రణీత జనరల్ సెక్రెటరీ గోపాల్ తదితరులతోపాటు నడిగడ్డ హక్కుల పోరాట సమితి కన్వీనర్ బుచ్చిబాబు నాయకులు విష్ణు,చిన్న రాముడు,బలరాం నాయుడు,వెంకట్ రాములు, మల్దకల్,లక్ష్మన్న,భూపతి గోపాల్,ఆశన్న,మీసాల కిష్టన్న,అమ్రేష్ తదితరులు పాల్గొన్నారు.