Listen to this article

బిచ్కుంద ఫిబ్రవరి 17. జనం న్యూస్

కామ రెడీ జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే కార్యాలయంలో తెలంగాణ ఉద్యమ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్), 72వ జన్మదినసందర్భంగా మంగళవారం బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. బిచ్కుంద పట్టణ అధ్యక్షుడు ఆవారా శ్రీనివాస్ మాజీ జెడ్పిటిసి రాజు మాజీ సొసైటీ చైర్మన్ బాలు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా రామచందర్ మాట్లాడుతూ తెలంగాణ సాధనలో కేసీఆర్ కీలక పాత్ర పోషించారని, ప్రజలకు సేవలందించిన నాయకుడని కొనియాడారు. కెసిఆర్ ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షు పొంది ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అనంతరం టిఆర్ఎస్ నాయకులు గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్లి రోగులకు అరటి పనులను అందజేశారుఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లికార్జున్, సొసైటీ వైస్ చైర్మన్ యాదవ్ రావు కల్లాలి మాజీ సర్పంచ్ సంజు పటేల్ సీనియర్ నాయకుడు హాజీ లక్ష్మణ్ నాల్చారు శ్రీనివాస్ హనుమాన్లు సంగారెడ్డి పత్తలాపూర్ మాజీ సర్పంచ్ అరుణ్ కుమార్ ఉప సర్పంచ్ శివకాంత్ , దడిగి మాజీ సర్పంచ్ విట్టల్ రెడ్డి తక్కడపల్లి అశోక్ బీఆర్‌ఎస్ మండల కార్యకర్తలు, పార్టీ నాయకులు మరియు అభిమానులు పాల్గొన్నారు.