జనం న్యూస్, ఫిబ్రవరి 17, జగిత్యాల జిల్లా,
మెట్ పల్లి : నిన్న మెట్ పల్లి మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రమాణ స్వీకారం చేసిన 15 వార్డ్ కౌన్సిలర్ అరిగెల అనూష-రాకేష్ ఈరోజు మాట్లాడుతూ మన 15 వ వార్డు కౌన్సిలర్ గా నాపై నమ్మకంతో ఓటేసి గెలిపించిన వార్డు సభ్యులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు, ఈ సందర్భంగా నా ఎన్నికకు పని చేసిన ప్రతి బీజేపీ కార్యకర్తకు, శ్రేయోభిలాషులకి, బంధు మరియు మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు, అదేవిధంగా మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, మన వార్డు అభివృద్ధికి కట్టుబడి ఉంటామని వార్డు లో ప్రస్తుతం ఉన్న సమస్యలన్నిటికీ సాధ్యమైనంత త్వరగా పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని, వార్డుకి అవసరం ఉన్న అన్ని పనులు చేస్తూ వార్డుని అభివృద్ధి చేయడమే లక్ష్యమని అన్నారు


