జనం న్యూస్ ;17 ఫిబ్రవరి మంగళవారం జనం న్యూస్:
సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై రమేష్ ;డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన డిగ్రీ( సి బి సి ఎస్ )సెమిస్టర్ 5, 3, 1 పరీక్షలు ఫిబ్రవరి 17, 2026 నుండి ప్రారంభమవుతున్నట్లు ప్రాంతీయ కేంద్రం ప్రకటించింది. పరీక్షా ఫీజులు చెల్లించిన విద్యార్థులు మాత్రమే పరీక్షలకు హాజరు కావాలని అధికారులు తెలిపారు.పరీక్షల షెడ్యూల్ ప్రకారం సెమిస్టర్–5 పరీక్షలు ఫిబ్రవరి 17 నుండి 22 వరకు, సెమిస్టర్–3 పరీక్షలు ఫిబ్రవరి 24 నుండి మార్చి 2 వరకు, అలాగే సెమిస్టర్–1 పరీక్షలు మార్చి 4 నుండి 10 వరకు నిర్వహించబడనున్నాయి.ఈ పరీక్షలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సిద్దిపేట ఆవరణలో జరుగుతాయని ప్రాంతీయ సమన్వయకర్త డా. ఎం. శ్రద్ధానందం తెలిపారు.విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నప్పుడు హాల్ టికెట్‌తో పాటు చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. సమాధానాలు రాయడానికి బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్ మాత్రమే ఉపయోగించాలన్నారు. మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్షా కేంద్రానికి తీసుకురావద్దని హెచ్చరించారు.విద్యార్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్ ద్వారా ముందుగానే డౌన్లోడ్ చేసుకొని పరీక్షలకు సమయానికి హాజరుకావాలని కోరారు.


