జనం న్యూస్ ఫిబ్రవరి 17 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన ప్రభుత్వ విప్ దాట్లసుబ్బరాజు ఆక్వా రంగం ప్రస్తుతం సంక్షోభంలో ఉందని, ఆక్వా రైతులను ఆదుకుంటామని కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగిందని దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారని మత్స్యశాఖ వారు సర్టిఫికేషన్ కార్యక్రమం ఇంకా పూర్తి చెయ్యని కారణంగా ఆక్వా రైతులకు ప్రభుత్వపరంగా సహాయం అందడం లేదని ఆక్వా జోన్ నాన్ ఆక్వా జోన్ సంబంధం లేకుండా త్వరితగతిని సర్టిఫికేషన్ కార్యక్రమం పూర్తిచేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. అదేవిధంగా ఆక్వారంగానికి యూనిట్ విద్యుత్ చార్జి ₹ 1.50 అందించే విధంగా తగిన చర్యలు చేపట్టాలని సభాముఖంగా తెలియజేశారు అదేవిధంగా మచిలీపట్నంలో ఒక గ్రామం మొత్తం అన్ని ప్రభుత్వ భూములు గా ప్రకటించడం వల్ల అక్కడ ఎదురవుతున్న సమస్యలపై సభ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగినది.


