జనం న్యూస్ అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
మెయిన్ రోడ్ లో బాలకృష్ణ ఫ్యాన్స్ బస్ స్టాప్ వెనుక నూతనంగా ఏర్పడిన కాలనీలో అక్కడ భవన యజమానులు సిమెంట్ రోడ్లు కాలవలు లేకపోవడంతో రోడ్లపైనే నీరు ఉండిపోవడంతో వార్డు కార్పొరేటర్ చిన్నతల్లి నీలబాబు పర్యటనకు వెళ్ళిన సందర్భంగా అక్కడ ఇబ్బందులు పరిశీలించిన తర్వాత శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ జీవీఎంసీ మేయర్ పిలా శ్రీనివాసరావు అనకాపల్లి నియోజకవర్గ ఇన్చార్జి పీలా గోవింద సత్యనారాయణ సహాయ సహకారాలతో జీవీఎంసీ నుండి నిధులు మంజూరు చేయించి 84 వ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు 10 కోట్లతో ముమ్మరంగా పనులు సాగుతున్నాయని తెలుగుదేశం పార్టీ 84 వ వార్డు ఇన్చార్జ్ మాదంశెట్టి నీలబాబు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ భవన యజమానులు కొణతాల చిరంజీవి దాడి లింగబాబు ఆడిటర్ గణేష్ కాండ్రేగుల బుజ్జి ఇంజనీరింగ్ సిబ్బంది కాంట్రాక్టర్ కె. జగన్నాథ నాయుడు తదితరులు పాల్గొన్నారు.//


