Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 18 అనకాపల్లి రిపోర్టర్ కృష్ణ

అనకాపల్లి జిల్లా బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు పలక రవి ఆధ్వర్యంలో అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ జన్మదిన సందర్భంగా బుధవారం లెప్పర్స్ కాలనీలో400 కుటుంబాలకు మహిళలకు చీరలు, పళ్ళు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా. అనకాపల్లి పార్లమెంట్ ఇంచార్జ్ విజయ్ నాయుడు ను విజయరామరాజుపేట గ్రామ పెద్దలు వినాయక మందిరంలో పూజలు చేసి ఘనంగా సత్కరించారు, అనంతరం పేద మహిళలకు వస్త్రాలలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో. జిల్లా బిజెపి అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, కర్రి రామకృష్ణ, బోడ్డేడ నాగేశ్వరరావు,పోలవరపు త్రినాధ్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.//