జనం న్యూస్ నందలూరు కడప జిల్లా.
ఈనెల 25వ తేదీ నుండి 28వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్లోని మీరట్ నగరంలో జరగనున్న పారా సిట్టింగ్ వాలీబాల్* పోటీలకు ఆంధ్ర రాష్ట్రం నుండి వైయస్సార్ కడప జిల్లా, రాజంపేట నియోజక వర్గం,నందలూరు మండ లానికి చెందిన అలుసూరి శివకోటి ఎంపికైనట్లు పారా వాలీబాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బోర్డు వారు తెలపడం జరిగింది.ఈనెల 9వ తేదీ నుండి 12వ తేదీ వరకు విశాఖపట్నం వేదికగా గోపాలపట్నం లోని DSA ఇండోర్ స్టేడియం నందు జరిగిన పారా సిట్టింగ్ వాలీ బాల్ పోటీల్లో అత్యద్భు తమైన ప్రదర్శన కనబరిచి, కడప జిల్లా తరఫున జిల్లా పారా సిట్టింగ్ వాలీబాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి, జాతీయ స్థాయికి ఆంధ్ర రాష్ట్ర జట్టు తరఫున ఎంపిక కావడం జరిగిందని శివకోటి తెలియ జేశారు.


