Listen to this article

జనం న్యూస్, ఫిబ్రవరి 18,అచ్యుతాపురం:

రాంబిల్లి మండలంలోని ఇన్నోవేర్ ల్యాబ్స్ పరిశ్రమలో మంగళవారం రాత్రి సుమారు 9:30 నుంచి 9:45 గంటల మధ్య పారిశ్రామిక ప్రమాదం చోటుచేసుకుంది.పని జరుగుతున్న సమయంలో అమోనియా గ్యాస్ సిలిండర్ ఆకస్మికంగా పేలిపోవడంతో తీవ్ర విషవాయువు వ్యాపించింది.ఈ ఘటనలో కంపెనీలో సెప్టెంబర్ 2024 నుండి కెమిస్ట్‌గా పనిచేస్తున్న బొద్ద అజయ్ కుమార్ (21) తీవ్రంగా అమోనియా గ్యాస్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని నియంత్రించారు.మృతదేహాన్ని అనంతరం పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్‌టీఆర్ ఆసుపత్రికి తరలించారు.నిత్యం ఫార్మా పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతున్న ఫ్యాక్టరీ ఆఫ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు,సేఫ్టీ ఆడిట్ వంటివి చేయకపోవడం వలన నిరంతరం ప్రమాదాలు జరుగుతున్నాయని వెంటనే ప్రమాదాల నివారణకు పరిశ్రమంలో సేఫ్టీ ఆడిట్ నిర్వహించి భద్రత ప్రమాణాలు పాటించని పరిశ్రమలపై తగు చర్యలు తీసుకొని కార్మికుల ప్రాణాలకు భద్రత కల్పించాలని,మృతుని కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం అందించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శులు ఆర్ రాము,జి దేముడు నాయుడు,అచ్యుతాపురం మండల కన్వీనర్ కె సోము నాయుడు డిమాండ్ చేశారు.