Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 18 అమలాపురం

ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) కార్యక్రమానికి సంబంధించి బ్రోచర్లు, పోస్టర్లను బుధవారం అమలాపురంలోని బిజెపి కార్యాలయంలో విడుదల చేశారు. డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా బిజెపి అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.మాజీ శాసనసభ్యులు అయ్యాజీ వేమ, రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్, జిల్లా మన్ కీ బాత్ కన్వీనర్ నాగిరెడ్డి సతీష్ రావు, యువమోర్చా జోనల్ ఇంచార్జి ఈశ్వర్ గౌడ్, కో-కన్వీనర్ ఎస్.సాధ్ధిక్ తదితరులు పాల్గొన్నారు.​ఈ నెల ఫిబ్రవరి 22న జరగబోయే 131వ ఎపిసోడ్ నుండి విద్యార్థుల కోసం ప్రత్యేక పోటీలను నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేయనున్నట్లు అడబాల సత్యనారాయణ ప్రకటించారు.​మారుమూల ప్రాంతాల్లోని సృజనాత్మకతను ప్రపంచానికి చాటడం, విద్యార్థులలో విషయ పరిజ్ఞానాన్ని పెంచి వారిని దేశాభివృద్ధిలో భాగస్వాములను చేయడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అమలాపురం రూరల్ బిజెపి అధ్యక్షుడు బొంతు శివాజీ, ఆలమూరు మండల అధ్యక్షుడు సుంకర శ్రీరామ్, ముమ్మిడివరం మండల అధ్యక్షుడు ఎస్.శర్మ, అల్లవరం మండల అధ్యక్షుడు కట్టాల నారాయణ మూర్తి, గోకరకొండ గంగన్న స్వామి తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.