

జనం న్యూస్ ఫిబ్రవరి 10 కూకట్పల్లి ప్రజలకు శ్రీనివాస్ రెడ్డిశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయ ప్రారంభోత్సవం మరియు శ్రీ వాసవి మాత విగ్రహ మూర్తి ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు, కూకట్ పల్లీ బాలాజీ నగర్ ఆర్యవైశ్య బస్తీ సంఘం వారి ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఆలయ పున: ప్రారంభం మరియు శ్రీ వాసవి మాత విగ్రహ మూర్తి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం వరకు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు పాల్గొని వాసవి మాత దివ్యదర్శనమును గావించారు, ఆలయ నిర్మాణంలో వారి యొక్క సహకారానికి ధన్యవాదాలు తెలియజేస్తూ కమిటీ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ని వేద బ్రాహ్మణ ఆశీర్వచనములతో ఘనంగా సన్మానించారు, అనంతరం దైవ సమానులు వారి గురువర్యులైన కీర్తిశేషులు వడ్డేపల్లి నర్సింగ్ రావు జ్ఞాపకార్థం మరియు వారి తల్లిదండ్రులైన కీర్తిశేషులు మందుల చంద్రయ్య మరియు లలితమ్మ దంపతుల ఆశీస్సులతో వడ్డేపల్లి రాజేశ్వరరావు కరకమలములచే శ్రీ లలితా – విష్ణు సహస్ర నామ స్తోత్రాలు మరియు భగవద్గీత పుస్తకములను ఆర్యవైశ్య సంఘం బస్తీ అధ్యక్షులు మందుముల మమత సంతోష్ కుమార్ గుప్త దంపతులు వారి సౌజన్యంతో ఆవిష్కరింపజేసి విగ్రహ ప్రతిష్ట మరియు ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ పుస్తకాలను పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు