Listen to this article

జనం న్యూస్. 10.నిజామాబాదు. ప్రతినిధి.సిరికొండ మండల కేంద్రంలో గల తెలంగాణ ఆదర్శ పాఠశాల&కళాశాలలో ప్రముఖ వ్యక్తీత్వ వికాస నిపుణులు గౌరవ వజ్జా నవనీత చే విద్యార్థిని విద్యార్థులందరికీ వ్యక్తీత్వ వికాస తరగతులు నిర్వహించడం జరిగింది. చదువు మరియు రాబోయే పరీక్షలను ఎలా ఎదుర్కోవడం,జీవితంలో లక్ష్యసాధన మొదలైన అంశాల పైన నవనీత గారి ప్రసంగం విద్యార్థులను మరియు తల్లిదండ్రులను ఆకట్టుకుంది. ఆమె మాట్లాడుతూ జీవితంలో లక్ష్యం లేని ప్రయాణం చేస్తే అనుకున్న గమ్యాన్ని చేరుకోలేమని కావున ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యంతో ముందుకెళ్లి తమ తల్లిదండ్రుల కలను నెరవేర్చాలని ఆమె సూచించారు.అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థినిలతో ప్రత్యేకంగా. మహిళాసాధికారత. పై చర్చించి వారికున్న సందేహాలను నివృత్తి చేయడం జరిగింది. పాఠశాల&కళాశాల ప్రిన్సిపాల్ గడ్డం రాజేష్ రెడ్డి మాట్లాడుతూ పిల్లల్లో చదువు పట్ల మక్కువ పెంచడం చదువు&పరీక్షల భయాన్ని పోగొట్టడం కొరకు వారిలో ఉండే ఆత్మనూన్యత భావాన్ని తొలగించి మనో ధైర్యాన్ని పెంపొందించడం కొరకు వ్యక్తీత్వ వికాస తరగతులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గడ్డంరాజేష్ రెడ్డి,ఉపాధ్యాయ బృందం,తల్లిదండ్రులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గోనడం జరిగింది.