Listen to this article

జనంన్యూస్. 10.నిజామాబాదు.ప్రతినిధి.నిజామాబాదు జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని కొండూరు పెద్దవాగులో ఈరోజు తేదీ 10/2/2025 నాడు కొండూర్ శివారులో గల మధ్యల వాగు బ్రిడ్జి దగ్గర కొంతమంది వ్యక్తులు ప్రభుత్వ అనుమతి లేకుండా దొంగతనంగా ఇసుకను తరలిస్తున్నారని సమాచారం రావడంతో అట్టి వ్యక్తులను రెవెన్యూ సిబ్బంది అయినటువంటి ఆర్ఐ కాస గంగారాజ్యం తన సిబ్బందితో కలిసి రెండు ట్రాక్టర్ల ను పట్టుకొని పోలీస్ స్టేషన్లో అప్పగించగా మేము అట్టి వాటిని పంచనామా నిర్వహించి వాటిని స్వాధీనపరచుకొని కేసు నమోదు చేయనైనది అట్టి ట్రాక్టర్లు సరిపల్లి తాండకు చెందిన మలావత్ బాలాజీ మరియు మలావత్ భాస్కర్ గార్లకు సంబంధించినవి దాని డ్రైవర్ పిట్ల రాజు కలరు ఆర్ ఐ కాస గంగ రాజం ఫిర్యాదు మేరకు పై ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్లో ఉంచనైనది ఇకపై ఎవరైనా ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను రవాణా చేసినట్లయితే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని సిరికొండ ఎస్ హెచ్ ఓ బి బాల్ సింగ్ తెలపనైనది