Listen to this article

రేకుల గది నుంచి సొంత ఇంటి కల సాకారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం…

జనం న్యూస్ ఫిబ్రవరి 19, వికారాబాద్ జిల్లా

పరిగి మండలం చిగురాల్ పల్లి గ్రామానికి చెందిన మల్లమ్మ కుటుంబం చిన్న రేకుల టాయిలెట్ గదిలో నివసిస్తున్నారని పత్రికల్లో వచ్చిన వార్తలపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఈరోజు ఘనంగా గృహప్రవేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులతో కలిసి హాజరయ్యారు.లబ్ధిదారులు మాట్లాడుతూ… తమ సొంత ఇంటి కలను నెరవేర్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,ఎమ్మెల్యే డా.టీ రామ్ మోహన్ రెడ్డి కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఇంతకాలం కష్టాల్లో జీవించాం… ఇప్పుడు మా పిల్లలకు సురక్షితమైన ఇల్లు కల్పించిన ప్రభుత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటాం” అని తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ “రోటీ, కపుడా ఔర్ మకాన్ ప్రతి ఒక్కరికీ అందాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం” అని అన్నారు.ప్రతి లబ్ధిదారునికి నెలకు 6 కిలోల సన్నబియ్యం అందజేస్తూ,ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్ సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు.పరిగి నియోజకవర్గానికి సంబంధించిన రూ.110 కోట్ల కరెంట్ బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించిందని వెల్లడించారు.అలాగే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం, మహిళా సంఘాల ద్వారా వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నామని చెప్పారు.రైతులకు సంవత్సరానికి రూ.12,000 చొప్పున రైతు భరోసా కింద త్వరలో తొలి విడతగా రూ.6,000 నేరుగా ఖాతాల్లో జమ చేయనున్నట్లు పేర్కొన్నారు.పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న జెడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదించాలని ఎమ్మెల్యే TRR గారు కోరారు.