జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఫిబ్రవరి 19
చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసియున్న శ్రీ దత్త సాయి సన్నిధిలో ఈరోజు పాల్గొనమాసం మొదటి గురువారం , గురు నక్షత్రమైన పూర్వాభాద్ర నక్షత్రమును పురస్కరించుకొని ఉదయం నుంచి ప్రత్యేక అభిషేక అర్చన పూజా కార్యక్రమాలు జరిగినాయి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని భావాన్ని దర్శించి ప్రత్యేక పుష్పాల పూజ నిర్వహించారు అనంతరం దాతల సహకారంతో అన్నసంతర్పణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ట్రస్టు నిర్వాహకులు పూసపాటి బాలాజీ మాట్లాడుతూ ఈరోజు పరమపవిత్రమైన గురు నక్షత్రమైన పూర్వాభాద్ర నక్షత్రం గురువారం కలిసి రావడం చాలా విశేషమని భక్తులకు గురు బలం లభించడానికి ఈరోజు చాలా ముఖ్యమైన రోజు అని ఈరోజు చేసిన అన్నదాన కార్యక్రమము గానీ ఏ సేవా కార్యక్రమాంగానే ఏ దాన కార్యక్రమంగానే విశేష ఫలితాలను ఇస్తాయని గురు గ్రహం యొక్క అనుగ్రహం కలిగి సకల సమస్యలు తొలగి పితృ దోష నివారణ జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు అయినవోలు హనుమంతరావు , ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ పి అన్నదాత తదితరులు పాల్గొన్నారు


