Listen to this article

బిచ్కుంద ఫిబ్రవరి 19 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం పుల్కల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడవ తరగతి విద్యార్థులకు వ్యవసాయం ఎరువులు భూసారం మరియు మట్టి పరీక్షలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. విద్యార్థులకు వ్యవసాయం మరియు నేల ఆరోగ్యం పై అవగాహన ఉండాలని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పీఎం శ్రీ పథకం కింద ఎంపికైన పాఠశాలలకు మట్టి పరీక్ష కిట్లు అందజేయడం జరిగింది. దీనిలో భాగంగా విద్యార్థులకు మొదటగా వ్యవసాయం గురించి, నేల గురించి, నేలలో లభించే వివిధ పోషకాల గురించి, భూసారం గురించి, ఎరువుల గురించి మరియు మట్టి నమూనా పరీక్షల గురించి క్లుప్తంగా వివరించడం జరిగింది. అనంతరం క్షేత్రస్థాయిలో మట్టి నమూనాను సేకరించే విధానం విద్యార్థులతోనే తీయించి అందరికీ చూపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆనంద్ కుమార్ గారు, మండల వ్యవసాయ అధికారి అమర్ ప్రసాద్, వ్యవసాయ విస్తరణ అధికారి దయానంద్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.