Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 10 రిపోర్టర్ సలికినిడి నాగరాజు ఆలపాటికి 90 శాతానికి పైగా ఓట్లు పోలయ్యేలా, బాధ్యతతో పనిచేయండి మాజీమంత్రి ప్రత్తిపాటిప్రతి పట్టభద్రుడిని వ్యక్తిగతంగా కలిసి రాష్ట్ర ఆర్ధికస్థితి, కూటమి ప్రభుత్వ పనితీరు తెలియచేయండి.పెట్టుబడులసాధన, ఉపాధి కల్పన కోసం చంద్రబాబు అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు, రాబోయే ఫలితాలు వివరించండి. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో 90 శాతానికి పైగా ఓట్లు కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కి పోలవ్వాలని, ప్రతి ఓటర్ ని వ్యక్తిగతంగా కలిసి, కూటమి ప్రభుత్వ పనితీరు వివరించాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం రాత్రి జరిగిన బూత్, క్లస్టర్, యూనిట్ ఇంచార్జ్ లు, సాధికార మిత్రల నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. 30 ఓట్లకు ఒకరు చొప్పున నియమితులైన సాధికారమిత్రలు ప్రతి పట్టభద్రుడిని కలిసి కూటమి ప్రభుత్వ విధానాలు, పనితీరు తెలియచేయాలని పుల్లారావు తెలిపారు. రాష్ట్ర అభివృద్దే ప్రధాన ధ్యేయంగా, పెట్టుబడుల సాధన.. ఉద్యోగాల కల్పన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన నూతన సంస్కరణలు, భవిష్యత్ ఫలితాలు యువతకు తెలియచేసి వారి అభిప్రాయాలు తెలుసుకోవాలన్నారు. శివరాత్రి అన్నా, పనులు ఉన్నాయన్నా వదిలిపెట్టకుండా టీడీపీ నాయకులు, సాధికార మిత్రలు పట్టుదలతో ఓట్లు వేయించాలని పుల్లారావు స్పష్టం చేశారు. మొదటి ప్రాధాన్యత ఓటే మన అభ్యర్థికి పడేలా ఓటర్లకు బ్యాలెట్ నమూనా ద్వారా స్పష్టమైన అవగాహన కల్పించాలన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి అత్యధిక ఓట్లు పోలయ్యేలా భాద్యతతో పనిచేయాలన్నారు. మన అభ్యర్థి ఆలపాటిఫై పట్టభద్రుల్లో సానుకూలవైఖరి, సదభిప్రాయం ఉందని, ఆయన్ని ఎవరూ వద్దనుకునే అవకాశమే లేదన్నారు. ఆలపాటికి వచ్చే మెజారిటీఫై రాష్ట్రస్థాయిలో చర్చ జరగాలన్నారు. పట్టభద్రుల్లో ఏమైనా అసంతృప్తి ఉన్నట్టు ఎన్నికల సిబ్బందికి అనిపిస్తే నేరుగా వారిని నాతోనే మాట్లాడించాలని పుల్లారావు చెప్పారు. సమావేశంలో నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు పోలంరెడ్డి దినేష్ రెడ్డి, జనసెన ఇంచార్జి తోట రాజా రమేష్, పట్టణ అధ్యక్ష , కార్యదర్శులు పఠాన్ సమాధ్ ఖాన్, మద్దుమలా రవి, కూటమి పార్టీల ముఖ్య నాయకులు, బూత్, క్లస్టర్, యూనిట్ ఇంచార్జ్ లు, సాధికార మిత్రలు పాల్గొన్నారు.