Listen to this article

జనం న్యూస్ 20 ఫీబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

గద్వాల్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అమలు చేసిన ప్రతి కార్యాచరణ అధిష్ఠానం ఆదేశాల మేరకు మాత్రమే జరిగింది.ఎవరి వ్యక్తిగత నిర్ణయాలకు బీఆర్ఎస్ పార్టీలో అవకాశం ఉండదు.ప్రతి ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు వివిధ అనుభవాలు,మిశ్రమ ఫలితాలు ఎదురవుతుంటాయి.వాటన్నిటినీ పార్టీ అధిష్ఠానం సమీక్షించి,భవిష్యత్ లో మెరుగైన ఫలితాల కోసం కార్యాచరణ చేపడుతుంది.మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత సోషల్ మీడియాలో అనవసర వాదోపవాదాలు,వదంతుల వ్యాప్తికి ఎవరు కారణంగా మారినా మంచి సాంప్రదాయం కాదు.సోషల్ మీడియా,మీడియా,పార్టీ అభిమానులు అందరికీ సమన్వయం పాటించాలని విజ్ఞప్తి. రాజకీయాలు జీవితంలో ఒక భాగమే తప్ప అవి మాత్రమే జీవితం కాదు.నిబద్ధత కలిగిన పార్టీ నాయకులు ఎవరమైనా ఆయా పార్టీల రాజకీయ లక్ష్యాల కోసం సంధర్బానుసారంగా పోరాటం చేస్తాం,ఫలితాల కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తాం. గద్వాల్ మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జిగా నా బాధ్యతల నిర్వహణ కూడా ఫలితాల ప్రకటనతో ముగిసింది.మేము (బీఆర్ఎస్ నేతలం) ఎవ్వరైనా అధిష్టానం ఆదేశాల మేరకే నడుచుకోవాలి. అంతిమంగా పార్టీనే శక్తివంతమైనది. బీఆర్ఎస్ పార్టీ అధిష్ఠానంకు గద్వాల్ మాత్రమే కాదు 119 నియోజకవర్గాల రాజకీయ పరిస్థితులపై సమగ్ర అవగాహన ఉంది. కాబట్టి మున్సిపల్ ఎన్నికల విషయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల చుట్టూ జరుగుతున్న అనవసర చర్చను పక్కకు పెట్టి విలువైన సమయాన్ని సరైన రీతిలో సద్వినియోగం చేసుకుందాం.మీడియా,సోషల్ మీడియా,రాజకీయ పార్టీల నేతలు అందరిపట్ల నా విజ్ఞప్తి డాక్టర్ ఆంజనేయ గౌడ్.రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్.