Listen to this article

జహీరాబాద్, ఫిబ్రవరి 20:జహీరాబాద్ హరేకృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో ఈ నెల 22న ఆదివారం

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్

ఉదయం 6 గంటలకు పట్టణంలోని సాయిరాం కాలనీ పోచమ్మ ఆలయంలో 195వ నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆ సంస్థ బాధ్యులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హరేకృష్ణ మహామంత్ర జపం, ప్రభుపాదుల ప్రార్థన, కీర్తనలతో శోభాయమనంగా కొనసాగనుందని తెలిపారు. హోళీ మాసం సందర్భంగా భక్తులు వివిధ రకాల పూవులతో సంబరాలు జరుగుతాయని, భక్తులు సాంప్రదాయ వస్త్రధారణతో రావడమే కాకుండా తమ వెంట పూవులు తీసుకురావాలని కోరారు. తదనంతరం సంగారెడ్డి జిల్లా కంది హరేకృష్ణ టెంపుల్ బాధ్యుల ద్వారా సత్సంగ ప్రవచనం, నరసింహ ఆరతి, ప్రసాద వితరణ ఉంటుందని వివరించారు.