Listen to this article

జనంన్యూస్. 20.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.

సిరికొండ మండలం లొని తూంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యా దేవత సరస్వతి దేవికి గ్రామ డిప్యూటి సర్పంచ్ అయినాల శ్రీకాంత్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు విద్యలో రాణించాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
పూజల అనంతరం పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షల సమయంలో ఉపయోగపడే విధంగా పరీక్ష పాడ్స్‌ను ఆయన స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సర్పంచ్ అయినాల శ్రీకాంత్ మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థానాలను చేరుకోవాలంటే విద్యే ప్రధాన ఆయుధమని పేర్కొన్నారు. కష్టపడి చదివితే ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని, గ్రామానికి, తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులను ప్రోత్సహించారు.అలాగే పరీక్షలను భయపడకుండా ధైర్యంగా రాయాలని, సమయపాలన పాటించాలని, ఉపాధ్యాయులు చెప్పిన సూచనలను తప్పకుండా పాటించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ జినుక రాజేందర్ వార్డ్ సభ్యులు గోవర్ధన్ గౌడ్,రాజు విడీసీ చైర్మన్ లక్ష్మణ్, లింగం, వినోద్ తూంపల్లి యువత నరేష్, అజయ్, సన్నీ, సాకేత్, మహిపాల్,శేఖర్,మురళి మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు..