జుక్కల్ ఫిబ్రవరి 20 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పిట్లం మండలం చిన్న కొడప్గల్ గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ ఆర్. వెంకట్ రామ్ రెడ్డి సతీమణి పుష్పావతి రెండు రోజుల క్రితం పరమపదించారు.ఈ విషయం తెలుసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు శుక్రవారం రోజు చిన్న కొడప్గల్‌కు చేరుకుని వారి భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం మాజీ ఎమ్మెల్సీ ఆర్. వెంకట్ రామ్ రెడ్డి ని మరియు కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుష్పావతి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.



