

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 10 రిపోర్టర్ సలికినిడి నాగరాజు ✍️ పల్నాడు ఎస్పీ కి నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ఫిర్యాదునవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం ఇంటిపైన దాడి, హత్యయత్నం కేసులో మాజీ మంత్రి విడదల రజని,ఆమె మరిది విడదల గోపి కారకులని వారిని 2022లో జరిగిన కేసుల్లో ముద్దాయిలుగా చేర్చాలని కోరుతూ నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం సోమవారం మధ్యాహ్నం 12:30 సమయంలో పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ని కలసి వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.15-04-2022 న జరిగిన దాడిలో విడదల రజిని ఆమె మరుదులు గోపి,రాము ప్రముఖపాత్ర పోషించారని, ఆ సంఘటన వలన పక్షవాతం వచ్చి తన తల్లి రావు చంద్రవతి చనిపోయారని,ఇప్పటికి 100 మంది నిందితులుంటే ఒక్కరిని కూడా పోలీసులు అరెస్ట్ చేయకపోవడం దారుణంగా ఉందని ఎస్పీకి రావు సుబ్రహ్మణ్యం వివరించారు.రౌడీ ఇజం, గూండా ఇజం చేసిన వాళ్లపై చర్యలు తీసుకోకపోవడం దారుణం అన్నారు.నవతరం పార్టీ అధ్యక్షుడుగా ఉన్న నాకే రక్షణ లేకపోతే సామాన్యులకు ఎలా రక్షణ ఉంటుంది అన్నారు.అధికారం అడ్డుపెట్టుకొని రజని చిలకలూరిపేట నియోజకవర్గంలో గూండా రాజ్యం నడిపారని తెలిపారు.2022 ముందు కూడా విడదల రజని,విడదల గోపి అనుచరులు అర్ధరాత్రి వచ్చి చంపేందుకు ప్రయత్నం చేసారని ఆకేసు కూడా అధికారం అడ్డుపెట్టుకొని అప్పటి మంత్రి రజని నిందితులను కాపాడారని ఎస్పీకి వివరించారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి దాడి కారకులు అయిన విడదల రజని ఆమె కుటుంబ సభ్యులు కొందరు, ఆమె అనుచరులు మొత్తం పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రావు సుబ్రహ్మణ్యం ఎస్పీకి విన్నవించారు.ఎస్పీ సమగ్ర దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకుంటామని రావుసుబ్రహ్మణ్యంకి హామీ ఇచ్చారు.ఇదే అంశం పైన చిలకలూరిపేట నవతరం పార్టీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో రావు సుబ్రహ్మణ్యం మాట్లాడి వివరాలు తెలిపారు