జనం న్యూస్ ఫిబ్రవరి 21:నిజామాబాద్ జిల్లాఏర్గట్లమండలములోనితడ్పాకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొనిపాఠశాలలో తెలుగు భాషా పండితుడు ఆకుల దేవనందంను శాలువాతో ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా దేవనందం మాట్లాడుతూ తెలుగు భాష ప్రాముఖ్యతను వివరించారు. మాతృభాష మన ఆత్మగౌరవానికి ప్రతీక అని,తెలుగు భాషను ప్రేమించి, పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు.తన సేవల ద్వారా తెలుగు భాషకు జీవం పోస్తున్న దేవనందం బయటి పోటీ ప్రపంచంలో నిలబడాలంటే చదువు, ఉద్యోగంతో పాటు వ్యాపార నైపుణ్యం అవసరం. వ్యాపారం చేయాలంటే మాట రావాలి,ఆ మాట మాతృభాషలో ఉంటేనే మనిషి గట్టిగానిలబడగలడు” అని పేర్కొన్నారు. తెలుగు భాష జీవనోపాధికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.తరగతి గదిలోనే కాక జీవన ప్రయాణంలోనూ మాటకు విలువ నేర్పిస్తున్న దేవనందం తెలుగు భాష జీవంతత్వానికి నిలువెత్తు ఉదాహరణగా నిలుస్తున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు జావిద్ ప్రశంసించారు. ఆకుల దేవనందంకృషిఅభినందనీయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలోఉపాధ్యాయులు సుధాకర్, గంగాధర్, రాములు, రవి, స్వప్న, నవీన్, చక్రపాణి, ఆనంద్, భూపతి, విజయ, కృష్ణప్రసాద్ పాల్గొన్నారు.


